తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు( Lok Sabha elections ) పోలింగ్ కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇప్పటివరకు 9.5 శాతం పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.
అయితే ఉదయం నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ స్టేషన్ల( Polling stations ) వద్ద క్యూ కట్టారు.
ఈ క్రమంలో ఇప్పటికే సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్ కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని వికాస్ రాజ్ వెల్లడించారు.







