ఏపీలో మే 13వ తారీకు సోమవారం పోలింగ్ జరగనుంది.ఎన్నికల ప్రచారానికి శనివారం చివరి రోజు వైసీపీ అధినేత జగన్( YCP chief Jagan ) పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు.
పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీతా పోటీ చేస్తున్నారు.ఈ క్రమంలో జరగబోయే ఎన్నికలలో వంగా గీతాని( Vanga Gita ) గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.దత్త పుత్రుడు అంటూ సెటైర్లు వేశారు.
కార్లు మార్చినట్టు భార్యలను మారుస్తాడు.ఇటువంటి వ్యక్తిని నా అక్కా చెల్లెమ్మలు నమ్మే పరిస్థితి ఉంటుందా.?.ఒకసారి జరిగితే పొరపాటు.రెండోసారి జరిగేటప్పుడు అదే మూడోసారి.నాలుగో సారి జరిగితే అలవాటు.
ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే రేపు ఏ అక్క చెల్లెమ్మ పని నిమిత్తం దత్తపుత్రుడిని కలిసే పరిస్థితి ఉంటుందా.? ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి వద్దకు ఏ మహిళ అయినా పని అడగగలరా.? ఈ దత్త పుత్రుడికి ఓటేసి గెలిపిస్తే… పిఠాపురంలో ఉంటాడనే గ్యారెంటీ లేదు.ఇటీవల జలుబు వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోయాడు.
ఈ పెద్ద మనిషికి ఇప్పటికే భీమవరం, గాజువాక అయిపోయింది.ఇప్పుడు పిఠాపురం.
ఇటువంటి వ్యక్తికి ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుందా.? అంటూ పిఠాపురం( Pithapuram ) ప్రజలను ఉద్దేశించి జగన్ సంచలన ప్రశ్నలు వేశారు.వైసీపీ అభ్యర్థి వంగా గీత స్థానికరాలు.ఆమెను బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే డిప్యూటీ సీఎంగా చేసి పిఠాపురానికి పంపిస్తా అని సీఎం జగన్ పిఠాపురంలో సంచలన స్పీచ్ ఇచ్చారు.