ఏ హీరో అయినా సరే రాజమౌళి ( Rajamouli )దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు.ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అంతా కూడా ఇదే తరహా ఆశ కలిగి ఉంటారు.తమకు ఒక అవకాశం దొరక్కపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.
కానీ అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో మాత్రం రాజమౌళితో సినిమా తీయాలని అనుకోవడం లేదట.అలాగే రాజమౌళి సైతం అల్లు అర్జున్ ( Allu Arjun )తో ఇకపై సినిమా తీయబోయే అవకాశం లేదట.
అందుకు అనేక కారణాలు ఉన్నాయి అవి ఏంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

గతంలో రాజమౌళి అల్లు అరవింద్ ( Allu Arvind )నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా మగధీర అనే సినిమా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో రెండవ సినిమా కాగా రాజమౌళి కెరియర్ లో ఎంతో ఎక్కువ బడ్జెట్ తో తీసిన మొట్టమొదటి సినిమా.అల్లు అరవింద్ సైతం అప్పటి వరకు తనకు ఉన్న ఆస్తి మొత్తం పెట్టి ఈ సినిమా కోసం పని చేశారు.
అలాగే రామ్ చరణ్ సైతం చాలా కష్టపడి స్టంట్ లు, గుర్రపు స్వారీ లాంటివి చేసి సినిమాకి ఎంతో బలాన్ని ఇచ్చారు.అయితే ఈ సినిమా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది.
అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలో ఇది ఇంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అని ఎవరు ఊహించలేదు.పైగా అల్లు అరవింద్ ప్రతిసారి ఈ సినిమా కోసం ఉన్నదంతా ఊడ్చి పెట్టాను అంటూ మాటిమాటికి అనేవారట.
అలాగే చిరంజీవి సైతం కొన్ని ఇంటర్వ్యూ లలో తన కొడుకు ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాడు అని చెప్పారట.

ఇదంతా రాజమౌళి క్రెడిట్ వల్ల జరిగిందనే విషయాన్ని అల్లు అరవింద్ కానీ చిరంజీవి కానీ ఎక్కడా చెప్పకపోవడంతో ఆయన చాలా హర్ట్ అయ్యారట.సినిమా విడుదలయ్యాక రాజమౌళి కి ఇస్తాను అన్న షేర్స్ విషయంలో కూడా అల్లు అరవింద్ మాట తప్పారట.దాంతో మగధీర సినిమా విజయానికి ఎవరు కారణం కాదని తను మాత్రమే ఆ సినిమాను విజయవంతం చేశానని రామ్ చరణ్ ని కాకపోతే ఒక ఈగ ను పెట్టి సినిమా తీస్తాను అని ఆ తర్వాత ఈగ సినిమా తీసి హిట్టు కొట్టారు.
అలా అల్లు అరవింద్ తో గొడవల కారణంగా ఆయనతో మళ్ళీ సినిమా తీయకూడదు అనుకున్నారు.ముఖ్యంగా అల్లు అర్జున్ తో ఇకపై ఆయన సినిమా తీసి అవకాశమే లేదట.







