సత్యదేవా .... ఏమైంది నీకు.. నీలోని నటుడికి పని చెప్పడం మర్చిపోయావా ?

హీరో సత్యదేవ్( Satyadev ).చాలా మంచి మెరిట్ ఉన్న నటుడు.

 What Happened To You Sathyadev ,satyadev, Krishnamma , Sidhu Jonnalagadda, Nav-TeluguStop.com

తనదైన పాత్ర పడ్డ రోజు సినిమాను తీసి అవతల పారేయగల కెపాసిటీ ఉన్న హీరో.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కాబట్టి కెరీర్ తొలినాల్లలో అందరికీ ఉన్న ఇబ్బందులే సత్యదేవ్ కి కూడా వచ్చాయి.

అవన్నీ అధిగమించి తనను తాను ప్రూఫ్ చేసుకొని హీరోగా నిలబడ్డాడు.మంచి కథలను ఎంచుకుంటాడు అనే పేరు కూడా సంపాదించుకున్నాడు.

పైగా అతడికి నటన అనేది వెన్నతో పెట్టిన విద్య అన్న విధంగా చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది.పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కిందిస్థాయి నుంచి పై స్థాయికి ఎదిగిన వ్యక్తి సత్యదేవ్.

Telugu Krishnamma, Satyadev, Tollywood, Vishwasen, Sathyadev-Telugu Top Posts

తాజాగా సత్యదేవ కృష్ణమ్మ( Krishnamma ) అనే ఒక సినిమాలో నటించాడు.ఈ సినిమా థియేటర్స్ కి వచ్చిన తర్వాత ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో సినిమాను చూద్దామని వెళ్లిన వారికి నిరాశ మిగిలింది.ఎందుకు ఈ సినిమాలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి దర్శకుడు సత్యదేవ్ లోని నటుడికి పని చెప్పలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.ఇంత మంచి నటుడు ఉన్నప్పుడు ఏ దర్శకుడైన బలమైన పాత్రను సృష్టించాలి.

కానీ పూర్తిగా బలహీనంగా అనిపించింది సత్యదేవ్ నటన.ఇక సినిమాలో హీరోయిన్ ఎందుకు ఉంటుందో కూడా అర్థం కాదు.ఉండాలి కాబట్టి ఉంది అంతే.చాలా రోజులుగా సత్యదేవ్ ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.

Telugu Krishnamma, Satyadev, Tollywood, Vishwasen, Sathyadev-Telugu Top Posts

ఇక ఈ సారి కూడా అతడికి నిరాశ ఎదురయింది.సత్యదేవ్ లాంటి నటుడు మంచి పాత్రలను ఎంచుకొని మంచి సినిమాలు తీయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ఇటీవల బ్యాగ్రౌండ్ లేకపోయినా కొంతమంది హీరోలు చాలా మంచి కథలతో, తమదైన డైలాగ్ డెలివరీతో, స్టైల్ తో సినిమాలు లాగిస్తున్నారు.అందుకు ఉదాహరణ సిద్ధూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి, విశ్వక్సేన్ లాంటి నటులు.

మరి వారి కన్నా కూడా ఎంతో మెరుగైన యాక్టర్ అయినా సత్యదేవ్ మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం.గత ఏడాది ఒక్క సినిమా కూడా తీయని కృష్ణదేవ్ ఏడాది కృష్ణమ్మ సినిమాతో మొదలుపెట్టాడు ఇక మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి మరి చూడాలి ఏ రేంజ్ పర్ఫామెన్స్ తో ఆ చిత్రాలు ఆకట్టుకుంటాయో.?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube