అతిలోక సుందరి శ్రీదేవి( Sridevi ) గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.ఈ ముద్దుగుమ్మ స్క్రీన్‌పై కనిపిస్తే ఎంతటి మగవాడైనా మనసు పారేసుకోవాల్సిందే.
అందానికే అందం ఎలా ఉంటుందో చూపించే రూపం ఆమె సొంతం.చక్కని హావభావాలు, క్యూట్ వాయిస్, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రలు వేసింది.
అయితే ఇలాంటి గొప్ప నటికి అందంలో ఒకరి పోటీ ఇచ్చారు.ఆమె రక్తంలో నటన కూడా ఉంది.
ఆమె ఎవరో కాదు శ్రీదేవికి స్వయానా చెల్లెలు శ్రీలత( Srilata ).శ్రీదేవి చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తూ చాలా పేరు తెచ్చుకుంది.కానీ ఆమె చెల్లెలు కొంచెం కూడా గుర్తింపు లేకుండా ఒక అనామక మహిళగా మిగిలిపోయింది.
ఆమె బహుశా తనకు నటించడం రాదు అని అనుకుందో ఏమో కానీ సినిమాలకు దూరంగా ఉండిపోయింది.
నటనరంగంలోకి రాకపోయినా సినిమా ఫీల్డ్ లోనే ఈమె తిరిగేది.షూటింగ్ స్పాట్లకు వెళ్ళేది.
శ్రీదేవితో కలిసి స్టూడియో సెట్లకు కూడా వెళ్తుండేది.మేనేజర్ గా కూడా పనిచేసింది.
ఒకానొక దేశలో శ్రీదేవి జీవితంలో ఒక విషాదమైన సంఘటన చోటుచేసుకుంది.అదేంటంటే శ్రీదేవి తల్లి జబ్బున పడింది.
ఆమెను కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించింది శ్రీదేవి.అయితే ఆ వైద్యం వికటించి తల్లి జ్ఞాపకశక్తి కోల్పోయింది.1996లో ఆ హాస్పటల్ చికిత్స వాళ్ల తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా మృతి చెందింది.దీంతో శ్రీదేవి ఆ ఆసుపత్రిపై కేసు వేసి రూ.7.2 కోట్ల( 7.2 crores ) దాకా డబ్బులు వసూలు చేసింది.

అయితే ఈ డబ్బులో రూపాయి కూడా చెల్లికి ఇవ్వలేదు.దాంతో శ్రీలత తన సొంత అక్క మీద కేసు పెట్టింది.తల్లి ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె చేత శ్రీదేవి వారసత్వ ఆస్తులన్నీ తన పేరిట రాయించుకుందని శ్రీలత షాకింగ్ అలిగేషన్స్ చేసింది.
ఈ ఆరోపణలు ఈ అతిలోకసుందరి క్యారెక్టర్‌పై పెద్ద మచ్చగా మారాయి.కోర్టు శ్రీలతకు అనుకూలంగా తీర్పు ఇస్తూ రెండు కోట్లు ఆమెకు ఇవ్వాల్సిందిగా శ్రీదేవికి ఆదేశాలు జారీ చేసింది.
దాంతో ఆమె ఆ డబ్బులు చెల్లికి ఇవ్వాల్సి వచ్చింది.ఈ ఘటనల వల్ల వీరి మధ్య దూరం బాగా పెరిగిపోయింది.అయితే బోనీకపూర్ వారిద్దరిని మళ్లీ కలిపాడు.

2018 బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.ఇది దుబాయ్ లో జరిగింది.శ్రీదేవి మరణించిన సమయంలో శ్రీలత కూడా దుబాయ్ లోనే ఉందట.
శ్రీదేవి మరణానికి బోనీకపూర్ కారణమని అప్పట్లో అనుమానాలు కూడా వచ్చాయి.శ్రీదేవి మరణం తర్వాత శ్రీలత ఎవరికీ కనిపించలేదు.
మీడియా ముందుకు అసలే రాలేదు.బోనీకపూర్ ఆమెతో కలిసి శ్రీదేవికి ఏదైనా హాని చేశాడా అనే కోణంలో అప్పట్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి.
ఏదేమైనా శ్రీలత ఎప్పటికీ అనామకంగానే మిగిలిపోతుందనేది స్పష్టంగా చెప్పవచ్చు.