ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు శనివారం హోరాహోరీగా ప్రచారం జరిగింది.ఇదే సమయంలో అల్లు అర్జున్( Allu Arjun ) అదేవిధంగా రామ్ చరణ్ కూడా ఎన్నికల ప్రచారాలలో పాల్గొనడం జరిగింది.
పిఠాపురంలో( Pithapuram ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్( Ram Charan ).తల్లి సురేఖతో కలసి రావటం జరిగింది.
ఇదే సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా పర్యటించడం జరిగింది.ఈ క్రమంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఆర్వో ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై( YCP MLA Shilpa Ravi ) నంద్యాల పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు శిల్పా రవికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటించగా భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం సంచలనంగా మారింది.
2024 ఏపీ ఎన్నికలలో సినిమా తారల సందడి ఎక్కువయింది.ప్రధానంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా చాలామంది నటీనటులు ప్రచారం చేశారు.జబర్దస్త్ టీం, సీరియల్ నటీనటులు, మెగా హీరోలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏపీ ఎన్నికలలో సినిమా తారల సందడి ఎక్కువయ్యింది.ఈ క్రమంలో జనసేనకి మద్దతు తెలుపుతున్నట్లు అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
కానీ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి స్నేహితుడు కావడంతో.బన్నీ చివరి రోజు నంద్యాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ క్రమంలో అనుమతి లేకుండా జన సమీకరణ చేశారని ఆరో ఫిర్యాదు చేయడం పోలీసులు కేసు నమోదు చేయటం సంచలనంగా మారింది