చాలామంది ఏదో ఒకరకంగా నటుడు అయిపోతూ ఉంటారు.కొంతమంది నేరుగా హీరోగానే ఎంట్రీ ఇస్తారు.
కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చి ఆ తర్వాత హీరోగా మారుతారు.మరి కొంతమంది గతంలో అయితే విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఉన్నారు.
కానీ వీరందరికి విభిన్నంగా సంపూర్ణేష్ బాబు( Sampuranesh Babu ) చాలా తెలివిగా హీరో అయిపోయాడు.తను ఎన్ని కష్టాలు పడ్డా కూడా అవి ఏనాడు బయటకు చెప్పుకోలేదు.
చాలామంది హీరోలకు సంపూర్ణేష్ బాబుకు తేడా ఉంటుంది.మొదట తనకు తానుగానే బాబు అనే పేరు పెట్టుకుని ఇండస్ట్రీకి తన ఐడెంటిటీ తెలియనివ్వకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
కానీ ఆ తర్వాత జనాలను మోసం చేయకూడదని ఉద్దేశంతో తన జీవితం గురించి పూసగుచ్చినట్టుగా చెప్పుకొచ్చాడు.

తనకు ఆస్తిపాస్తులు లేవు కేవలం తన అన్న షాపులో బంగారం, వెండి తయారు చేసే పనిలో ఉండి వారాంతం లో హైదరాబాదుకు వచ్చి సినిమా ప్రయత్నాలు చేసేవాడు.తన జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.అతని సినిమా జర్నీ అంత సాఫీగా ఏమీ సాగలేదు.
ఎలాగో సాయి రాజేష్( Sai Rajesh ) పరిచయంతో నటుడు అయిపోయాడు.అయితే ఒక హీరో అంటే ఆరడుగుల ఎత్తు ఉండాలి, అంతకు మించిన అందం ఉండాలి.
ఇవేవీ లేని సంపూర్ణేష్ బాబు హీరో అంటే జనాలు ఒప్పుకోవాలి అంటే దానికి తగ్గ కథ ఉండాలి.సంపూర్ణేష్ బాబు ని చూసిన తర్వాత ఎవరైనా కూడా హీరో అవ్వచ్చు అని నమ్మకం కలుగుతుంది.
ఇక హీరో అయితే ఎలాగూ అయిపోయాడు కానీ అందరిలా తాను మారలేదు.తన జీవితాన్ని తెరిచిన పుస్తకం చేసాడు.
తనలో ఎంతో సంస్కారం ఉంది అని రుజువు చేసుకున్నాడు.తనకు ఉన్న లేకపోయినా కూడా పక్కవారికి పెట్టే మనస్తత్వం ఉంది అతడికి.

కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఎవరు సహాయం చేయని రోజులు ఇవి.అయినా కూడా తనకొచ్చే అతి తక్కువ రెమ్యూనరేషన్ లో ఐరెన్ లెగ్ శాస్ర్తీ కుటుంబానికి కూడా సహాయం చేశాడు.తన దగ్గర ఐదు రూపాయలు ఉంటే అవి పూర్తిగా సమాజం కోసమే ఖర్చు పెడతాడు.ఇక ఎవరైనా ఫ్రీగా ఇస్తే ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకోడు.తనకు చిన్న పని చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చిన సరే కళ్ళకు అద్దుకొని తీసుకుంటాడు.ఇదే సంపూర్ణేష్ బాబు యొక్క నిజాయితీ.
ఆయన సినిమాలో విడుదలవుతే హిట్టవ్వలని కోరుకుంటారు చాలామంది.సంపూర్ణేష్ బాబుని ప్రేమించే వారి సంఖ్య అభిమానించే వారి సంఖ్య రోజుకి పెరుగుతుందే కానీ తగ్గదు.
అసలు సిసలైన నిజాయితీకి నిదర్శనం గా ఉన్న నటుడు అంతేకాదు ఒక సంచలనం కూడా.







