సాధారణంగా చాలా మంది బరువు తగ్గడం( Weight Loss ) కోసం కఠినమైన డైట్ ను ( Diet ) ఫాలో అవుతుంటారు.ఇష్టమైన ఆహారాలకు దూరంగా ఉంటూ ఎంతో వేదనకు గురవుతుంటారు.
అయితే నిజానికి డైట్ లేకుండా కూడా బరువు తగ్గవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.
రెగ్యులర్ గా ఈ జ్యూస్ ను( Juice ) తీసుకుంటే డైట్ లేకుండానే బరువు తగ్గొచ్చు.ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక యాపిల్ ( Apple ) తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న యాపిల్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి, చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ పొట్టు తొలగించి తరిగిన అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి, ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అంతే మన జ్యూస్ సిద్ధం అయినట్లే.ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.ప్రతిరోజు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.దాంతో క్యాలరీలో త్వరగా కరిగి వేగంగా బరువు తగ్గుతారు.పైగా ఈ జ్యూస్ ను తీసుకుంటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి.రోజంతా ఎనర్జిటిక్ గా ఉండడానికి ఈ జ్యూస్ ఎంతగానో సహాయపడుతుంది.

అంతేకాదు ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల రక్తహీనత దూరం అవుతుంది.మెదడు మునుపటి కంటే చురుగ్గా వేగంగా పనిచేస్తుంది.ఎముకలు దృఢంగా మారతాయి.కంటి చూపు రెట్టింపు అవుతుంది.మరియు క్యాన్సర్, మధుమేహం వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.కాబట్టి అధిక బరువు సమస్యతో బాధపడే వారే కాదు ఎవ్వరైనా ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.