అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో నిలిచిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump )రిపబ్లికన్ పార్టీ తరపున ఇప్పటికే అధికారికంగా నామినేషన్ దక్కించుకున్నారు.కోర్టు కేసులు వెంటాడుతున్నా ప్రచారాన్ని మాత్రం ఆయన హోరెత్తిస్తున్నారు.
అయితే ట్రంప్ అధ్యక్షుడైతే, మరి ఉపాధ్యక్షుడెవరు అనే చర్చ అమెరికాలో విస్తృతంగా జరుగుతోంది.తెరపైకి పలువురి పేర్లు వచ్చినప్పటికీ అవి పుకార్లేనని తర్వాత తేలింది.
తాజాగా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధిగా నార్త్ డకోటా గవర్నర్ డగ్ బర్గమ్ పేరు వినిపిస్తోంది.ట్రంప్‌తో కలిసి న్యూజెర్సీలోని( New Jersey ) వైల్డ్‌వుడ్‌లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆశ్చర్యం కలిగించింది.
అధ్యక్ష ఎన్నికల్లో తొలుత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం బర్గమ్ కూడా ప్రయత్నించగా.మధ్యలోనే తప్పుకున్నారు.

ఈ ర్యాలీలో ట్రంప్‌పై బర్గమ్( Burgum ) ప్రశంసల వర్షం కురిపిస్తూ జో బైడెన్‌ను విమర్శించారు.అధ్యక్షుడి బ్యూరోక్రాట్లు మన రాజ్యాంగ రిపబ్లికన్ను నియంతృత్వంలా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.డొనాల్డ్ ట్రంప్ అంటే బలం, జో బైడెన్( Joe Biden ) అంటే బలహీనత అని బర్గమ్ వ్యాఖ్యానించారు.అమెరికాను మళ్లీ బలోపేతం చేయాలంటే ఏం చేయాలో మీకు తెలుసునని ఆయన ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
అయితే బర్గమ్‌ను ఉపాధ్యక్ష అభ్యర్ధిగా ఎంపిక చేస్తారా లేదా అనే దానిపై ట్రంప్ క్లారిటీ ఇవ్వనప్పటికీ.ఈ ర్యాలీలో నార్త్ డకోటా( North Dakota ) గవర్నర్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
దేనికైనా సిద్ధంగా వుండాలని ట్రంప్ ప్రజలకు పిలుపునిచ్చారు.

జూలైలో జరిగే రిపబ్లికన్ జాతీయ సమావేశానికి ముందు ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్ధి ఎవరన్నది ప్రకటించే అవకాశం లేదు.అటు బర్గమ్ సైతం .తాను కేబినెట్ పదవి లేదా వైస్ ప్రెసిడెంట్ రేసులో వున్నది స్పష్టంగా చెప్పడం లేదు.కానీ ఈ విషయంలో ట్రంప్ మనసులో డజన్ల కొద్దీ నేతలు వున్నట్లు బర్గమ్ వెల్లడించారు.వారం క్రితం మార్ ఏ లాగోలో కలిసినప్పుడు .తన లిస్ట్‌లో 50 మంది ఉపాధ్యక్ష అభ్యర్ధులు వున్నట్లుగా ట్రంప్ చెప్పారని బర్గమ్ పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో ఈ లిస్ట్ మరింత పెరగొచ్చని ఆయన సంకేతాలిచ్చారు.
ఈ దేశం గురించి పట్టించుకునే ప్రతి ఒక్కరూ ట్రంప్ ప్రచారానికి సహాయం చేయాలని బర్గమ్ పిలుపునిచ్చారు.