ఆ కారణంతోనే బిడ్డను కోల్పోయాము.. ఎమోషనల్ అయిన అవినాష్!

జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో కమెడియన్ అవినాష్(Avinash ) ఒకరు.ఈయన అద్భుతమైనటువంటి కామెడీ స్కిట్ల ద్వారా ప్రేక్షకులను మెప్పించారు.

 Mukku Avinash Emotional Comments About His Child , Mukku Avinash,anuja, Doctors,-TeluguStop.com

అయితే ఈయనకు బిగ్ బాస్ (Bigg Boss) అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.అనంతరం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమయ్యారు.

ఇలా జబర్దస్త్ కి దూరమైనటువంటి ఈయన స్టార్ మాలో ప్రసారం అవుతున్నటువంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.

Telugu Anuja, Doctors, Jabardasth, Mukku Avinash-Movie

ఇదిలా ఉండగా ముక్కు అవినాష్ 2021వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.అనూజ (Anuja) అనే అమ్మాయితో ఏడడుగులు నడిచినటువంటి అవినాష్ తన భార్యతో కలిసి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ సందడి చేసేవారు.అంతే కాకుండా ఇటీవల ఈమె తల్లి కాబోతున్నారనే విషయాన్ని కూడా అభిమానులతో పంచుకున్నారు.

ఎప్పటికప్పుడు తన భార్య ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నటువంటి అవినాష్ తన భార్య బేబీ బంప్ ఫోటోలను కూడా అందరితో షేర్ చేసుకున్నారు.

తమ బిడ్డ రాబోతుందని ఎన్నో కలలు కన్నటువంటి వీరికి చేదు అనుభవమే మిగిలిందని చెప్పాలి.

డెలివరీకి ఒకరోజు ముందు కడుపులోనే తన బిడ్డను కోల్పోయినట్టు అవినాష్ తెలియజేశారు.అయితే తన బిడ్డ ఉమ్మనీరు తాగటం వల్లే చనిపోయిందని డాక్టర్లు చెప్పినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

తను హాస్పిటల్ కి వెళ్లిందని నేను షూటింగ్లో ఉండగా ఈ విషయం చెప్పడంతో నాకేం చేయాలో దిక్కు తెలియక హాస్పిటల్ కి వెళ్ళాను.డాక్టర్ కాళ్ళపై పడి నా బిడ్డను బ్రతికించమని కోరాను కానీ హార్ట్ బీట్ లేదని మేమేం చేయలేమని చెప్పారు.

ఆ క్షణం నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు.

Telugu Anuja, Doctors, Jabardasth, Mukku Avinash-Movie

తన భార్య తన బిడ్డ కోసం కలలు కనేది పాప పుడితే ఏ పేరు, బాబు పుడితే ఏ పేరు పెట్టాలని మాట్లాడుకునేవారు.ఇక కడుపులో నుంచి బిడ్డను బయటకు తీసిన తర్వాత చూస్తే అచ్చం నా పోలికలతోనే ఉంది అంటూ ఎమోషనల్ అయ్యారు.ఇప్పటికి ప్రతిరోజు రాత్రి ఈ విషయాన్ని తలుచుకొని తన భార్య ఏడుస్తూనే ఉంటుందంటూ అవినాష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube