జర్మనీలోని బెర్గెడార్ప్‌లోని బెజిర్క్( Bezirk in Bergedorp, Germany ) (జిల్లా) ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పంజాబీ నేత బరిలో దిగారు.56 ఏళ్ల పర్మోద్ కుమార్( Parmod Kumar ) (56) క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ) నుంచి పోటీ చేస్తున్నారు.1.7 లక్షల జనాభా కలిగిన బెర్గెడార్ప్ జిల్లాలో ఆయన తన ప్రచారానికి ప్రతిరోజూ 10-12 గంటలు కేటాయిస్తున్నాడు.ఇందులో 5 వేల మంది భారతీయులు, ఆఫ్ఘన్, పాకిస్తానీలు ఇతర దేశాలకు చెందినవారు ఉన్నారు.జూన్ 9న అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా పర్మోద్ మాట్లాడుతూ .తాను భారత ప్రభుత్వంతో మెరుగైన సంబంధాలను కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు.వ్యాపార సంబంధాలు, సాంస్కృతిక మార్పిడి, జర్మనీలో భారతీయ విద్యార్ధులకు మద్ధతు ఇస్తానని పర్మోద్ పేర్కొన్నారు.స్థానికులకు మెరుగైన రవాణా , మెరుగైన ఆర్ధిక వ్యవస్ధ, ఉద్యోగాల కల్పన వంటి సమస్యలను పర్మోద్ లేవనెత్తారు.
బెర్గెడార్ప్‌లో చదువుకోవడానికి ఎంతోమంది భారతీయ విద్యార్ధులు వస్తున్నారని, కానీ ఇక్కడ వారు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రతినిధిగా తాను ఈ సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నానని పర్మోద్ వెల్లడించారు.వసతి సమస్యలను పరిష్కరించి, విద్యార్ధులకు సరసమైన గృహాలను పొందేందుకు కృషి చేస్తానని ఆయన చెప్పారు.భారతీయులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించడంలో, వారికి అవసరమైన వనరులు అందించడంలో మార్గనిర్దేశం చేస్తానని పర్మోద్ పేర్కొన్నారు.అమృత్‌సర్‌లో( Amritsar ) జన్మించిన పర్మోద్ కుటుంబానికి బాల్ బేరింగ్ ఫ్యాక్టరీ ఉంది.1991లో ఆయన జర్మనీకి వెళ్లారు.డిష్‌వాషర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆయన అక్కడ వ్యాపారవేత్తగా ఎదిగి 120 మందికి పైగా ఉపాధిని కల్పిస్తున్నారు.
ఇదిలావుండగా.ఇటీవలి కాలంలో భారతీయులు జర్మనీకి కూడా బాగా దగ్గరవుతున్నారు.ఆటోమొబైల్ పరిశ్రమతో పాటు ఐటీ ఇతర రంగాలు జర్మనీ కేంద్రంగా పనిచేస్తున్నాయి.
అలాగే ఇక్కడ ప్రపంచస్థాయి యూనివర్సిటీలు నెలకొని వున్నాయి.దీంతో మన విద్యార్ధులు ఈ యూరోపియన్ కంట్రీ వైపు కూడా బాగానే ఆకర్షితులవుతున్నారు.