వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి( Ex Minister Gudivada Amarnath Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో( Assembly Elections ) ఓటమిపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగాలని తెలిపారు.
వ్యవస్థలో తెచ్చిన మార్పులు, సంస్కరణల వలన పార్టీ క్యాడర్ కు గౌరవం దక్కలేదని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే ప్రభుత్వానికి, పార్టీకి మధ్య దూరం పెరిగిందని చెప్పారు.
అదేవిధంగా ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కొత్త ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇస్తామన్న ఆయన హామీలు నిలబెట్టుకోకపోతే టీడీపీని( TDP ) ఎండగడతామని హెచ్చరించారు.
విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పై ప్రజాతీర్పు ఖచ్చితంగా రిఫరెండమేనన్నారు.మూడు రాజధానులను ప్రకటించినా అమరావతిని వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్( Visakha Steel Plant ) ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.