టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం సినిమాలలో బిజీబిజీగా అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
మొన్నటి వరకు మయో సైటిస్ వ్యాధి కారణంగా సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చిన సమంత ఇప్పుడు సినిమాలలో మళ్లీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.కేవలం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రమే కాకుండా తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సమంత.
అందులో భాగంగానే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది సామ్.
ఇకపోతే తాజాగా ఈఅమ్మడికి ఐఎండీబీ విడుదల చేసిన మోస్ట్ వ్యూడ్ ఇండియన్ స్టార్స్( Most Viewed Indian Stars) జాబితాలో చోటు దక్కింది.ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ తో పాటు సౌత్ స్టార్స్ ని వెనక్కి నెట్టి మరీ సమంత ఏకంగా 13వ స్థానంలో నిలిచింది.ఈ విషయమై తాజాగా ప్రముఖ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.
తనకు దక్కిన గుర్తింపుతో మరింత బాధ్యత పెరుగుతుందని చెప్పుకొచ్చింది.అలాగే ఐఎండీబీ ర్యాంకింగ్ లో 13వ స్థానం దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది.
నా కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది.
కెరీర్ ను ఇప్పుడే కొత్తగా మొదలు పెట్టినట్లుగా ఉంది.అప్పుడే ఇన్ని సంవత్సరాలు గడిచి పోయాయి అంటే ఆశ్చర్యంగా ఉంది, నమ్మలేకుండా ఉన్నాను అంది.ఇండస్ట్రీలో పోటీ వల్ల మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను.
అలాగే ఇండస్ట్రీ లో ఉన్న పోటీని నేను ఎప్పుడు కూడా నెగెటివ్ గా చూడను.నాకు పోటీ అనేది మరింతగా స్ఫూర్తిని ఇస్తుంది.
ఇతరులను చూసి నేర్చుకుంటాను తప్ప నెగెటివ్ గా ఆలోచించి కెరీర్ లో నష్టపోను అంటూ సమంత చెప్పుకొచ్చింది.