ఏపీలో టీచర్ల బదిలీలకు( AP Teachers Transfers ) బ్రేక్ పడింది.గతంలోని వైసీపీ ప్రభుత్వం( YCP Govt ) ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను నిలిపివేయబడ్డాయి.
ఈ క్రమంలోనే ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి బదిలీలూ చేపట్టొద్దని డీఈఓలకు ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేశ్ కుమార్ ( S Suresh Kumar ) ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా ఎన్నికలకు ముందు మొత్తంగా 1800 మంది టీచర్ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పైరవీలు, సిఫార్సుల మేరకు బదిలీలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో మొత్తం బదిలీలనే నిలిపివేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గత ప్రభుత్వం బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలతో జీవో నంబర్ 47 ను జారీ చేసిన సంగతి తెలిసిందే.