ఆ పార్టీ తరపున బెట్టింగ్ కాసి పది కోట్లు పోగొట్టుకున్న నిర్మాత.. ఏం జరిగిందంటే?

మామూలుగా క్రికెట్ మ్యాచులు జరిగేటప్పుడు అలాగే ఎలక్షన్స్ సమయంలో అలాగే సందర్భాల్లో బెట్టింగ్ వేసుకోవడం అన్నది కామన్.అలాంటప్పుడు కొన్ని కొన్ని సార్లు అదృష్టం కలిసి వచ్చి ఎక్కువ డబ్బులు రావచ్చు లేదా డబ్బులు పోవచ్చు.

 Tollywood Producer Betting On Ysrcp Party, Tollywood, Producer, Money Loss, Ycp,-TeluguStop.com

అయితే తాజాగా ఏపీలో కూడా ఇదే జరిగింది.మా పార్టీ అధికారంలోకి వస్తుంది అంటూ చాలామంది రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు పందాలు వేసుకున్నారు.

అయితే టాలీవుడ్ లో ఈ బెట్టింగ్ (betting)ల ఇచ్చి పిచ్చి గట్టిగానే వుంది.బెట్టింగ్ లు ఆడుతుంటారని టాక్ వుంది.

అయితే టాలీవుడ్ లో ఎక్కువ మంది కూటమి గెలవాలి అని కోరుకున్న వారే.

Telugu Tollywood-Movie

అందువల్ల నెంబర్ల సంగతి పక్కన పెట్టి కూటమికి అనుకూలంగా పందాలు కాసారు.అవన్నీ లక్షల్లో మాత్రమే, మహా అయితే అయిదు లక్షలు, పదిలక్షలు.నిర్మాతల స్టామినా చూసుకుంటే ఇవేమంత పెద్ద మొత్తాలు కావు.

కానీ ఒక నిర్మాత మాత్రం వైకాపాకు(YCP) అనుకూలంగా భారీగా పందెం కాసి, చాలా అంటే చాలా భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ లో మిగిలిన బడా సంస్థల మాదిరిగా ఏడాదికి నాలుగైలు భారీ సినిమాలు, అందరు టాప్ హీరోలతో సినిమాలు లాంటి వ్యవహారాలు లేకున్నా, పెద్ద సంస్థే అది కూడా.

చేసినవి భారీ సినిమాలే.పైగా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో వున్న వారే.

Telugu Tollywood-Movie

ఎన్నికలు ఇంకా ఒక స్టేజ్ కు రాకముందే అయిదు కోట్లు వైకాపాకు అనుకూలంగా పందెం కాసినట్లు తెలుస్తోంది.ఈ అయిదు కోట్లు స్వంత డబ్బు ను పందెం ఒడ్డినట్లు, ఇది కాక, వేరే వాళ్ల దగ్గర తీసుకుని అయిదు కోట్లు పందెం ఒడ్డినట్లు టాలీవుడ్ లో గ్యాసిప్ బలంగా వినిపిస్తోంది.ఆ నిర్మాత(producer) ధైర్యానికి టాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.ఎంత వైకాపా అంటే అభిమానం వున్నా, ఇలా చేయడం ఏమిటా? అని కామెంట్ చేస్తున్నారు.కొన్నాళ్ల క్రితం వరకు ఆర్ధికంగా ఇబ్బందుల్లో వుండి, తేరుకున్నారు.అలా తేరుకున్నాక మళ్లీ జాగ్రత్తగా వుండకుండా ఇలా చేయడం ఏమిటి? అని నిట్టూరుస్తున్నారు.అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇంతకీ ఆ నిర్మాత ఎవరు అని అందరూ తెగ ఆలోచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube