ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) ప్రమాణస్వీకార మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది.ఈ మేరకు ఈ నెల 9 వ తేదీ సాయంత్రం 6 గంటలకు మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఎన్డీఏ మిత్రపక్షాల( NDA Alliance ) మద్ధతుతో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు.కాగా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీలో( Delhi ) పక్షాల కీలక సమావేశం ఏర్పాటైంది.
జవహర్ లాల్ నెహ్రు తరువాత వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డ్ సాధించారు.మరోవైపు ఎన్డీఏ లో కేంద్ర మంత్రి పదవులకు డిమాండ్ పెరిగిందని తెలుస్తోంది.
ఏపీలో టీడీపీకి మూడు నుంచి ఐదు పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.ఇక జేడీయూకి రెండు లేదా మూడు మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.