మనిషి జీవితంలో ప్రతిరోజు కష్టపడుతూ తన కుటుంబాన్ని సహితం ఎన్నో కష్టాలను దరిచేరకుండా కాపాడుకుంటూ వస్తారు.అయితే కొందరు మాత్రం కష్టపడకుండా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అనేక అడ్డదారులు తొక్కుతూ అమాయకులను బలి చేస్తుంటారు.
ఇలా చాలామంది దొంగతనాలు పాల్పడుతూ వారి జీవితాన్ని గడిపేస్తుంటారు.మరికొందరు వారి సరదాల కోసం అమాయకుల ప్రాణాలను కూడా రిస్కులో పెట్టేవారు కూడా లేకపోలేదు.
ఎందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే చాలానే చూసాం.ఇకపోతే తాజాగా ఓ రైల్వే స్టేషన్ లో జరిగిన మొబైల్ దొంగతనం( Mobile Robbery ) గురించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియో గురించి వివరాలు చూస్తే.
చాలామంది భారతదేశంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రైలు మార్గాలను( Railways ) ఎంచుకోవడం సహజం.
ఇలా రైలు ప్రయాణం చేసేటప్పుడు విండో సీట్ కోసం కూడా చాలామంది ఆలోచిస్తుంటారు.దీనికి కారణం ప్రశాంతంగా చల్లగాలిలో ఫోన్ చూసుకుంటూ పాటలు వినకుంటూ ఎంజాయ్ చేస్తూ ప్రయాణం కొనసాగించవచ్చని.
దాంతో చాలామంది విండో సీటు( Window Seat ) పక్కనే కూర్చుని మొబైల్ కి ఛార్జింగ్ పెట్టుకుని సెల్లు చేతిలో పెట్టుకుని పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు.అయితే ఇదే పాయింట్‌ని కొందరు దొంగలు( Thieves ) చేతివాటం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.ఓ రద్దీగా ఉన్న రైలు బోగీలో ఓ వ్యక్తి కిటికీ వద్ద మొబైల్ చూస్తూ ఉన్నాడు.ఇక రైలు ప్రయాణం మొదలవుతున్న సమయంలో కుర్రాడు రైలు బయట నిలబడి ఆ కిటికీ దగ్గర ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతూ.వెళ్తున్న రైలుతో పాటుగా పరిగెత్తుకుంటూ వెళ్లి రైల్లోకి చేయి పెట్టి అతడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకొని అక్కడ నుంచి ఉడాయించడం జరిగింది.
అయితే ఆ సమయంలో ఒక వ్యక్తి వీడియోని తీయగా అది కాస్త వైరల్ గా మారింది.
కాబట్టి రైలు ప్రయాణం మాత్రమే కాకుండా ఏ ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా దొంగలు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు.కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉంటే ఎంతో మేలు.లేకపోతే మన విలువైన వస్తువులు దొంగల పాలవ్వడం గ్యారెంటీ.
ఇకపోతే ఈ సంఘటన ఏ రైల్వేస్టేషన్లో జరిగిందన్న విషయాలు మాత్రం ఇంకా తెలియ రాలేదు.ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను ఓసారి వీక్షించండి.