టీటీడీ చైర్మన్ పదవి ప్రచారంపై స్పందించిన నాగబాబు..!!

జనసేన నేత నాగబాబుకి టీటీడీ చైర్మన్( TTD Chairman) పదవి చేపట్టబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.కూటమి కోసం పోటీ విషయంలో త్యాగం చేయటంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నాగబాబు( Naga Babu )ని నియమించారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

 Nagababu Responded To The Campaign For The Post Of Ttd Chairman Janasena, Nagaba-TeluguStop.com

ఈ వార్తలపై నాగబాబు స్పందించి ఖండించారు.ఆ వార్తలలో ఏమాత్రం నిజం లేదని అన్నారు.

పార్టీ లేదా తన నుంచి అధికారిక ప్రకటన వస్తేనే నమ్మాలని స్పష్టం చేశారు.ఏపీ సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ కార్యక్రమాలను నాగబాబు దగ్గరుండి పర్యవేక్షించారు.

ఎన్నికల ప్రచారంలో కీలకంగా రాణించారు.

నిత్యం జనసేన పార్టీ( Jana Sena Party ) కార్యకర్తలతో నాయకులతో సమావేశాలు నిర్వహించి అందరినీ ఏకాతాటిపై నడిపించారు.ఎక్కడ గ్రూపు తగాదాలు లేకుండా జనసేన పార్టీ గెలవటంలో కీలక పాత్ర పోషించారు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 21 అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాలలో పోటీ చేసి.

అన్నిచోట్ల జనసేన గెలవడం జరిగింది.పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజార్టీ సాధించటంలో నాగబాబు ఎంతో కృషి చేశారు.

వాస్తవానికి ఇటీవల జరిగిన ఎన్నికలలో అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేయడానికి రెడీ అయ్యారు.కానీ కొన్ని అనివార్యాల కారణాలవల్ల పోటీ నుండి తప్పుకోవడం జరిగింది.

ఆ తర్వాత పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు పరిమితమై.అభిమానులు, కార్యకర్తలకి దిశా నిర్దేశం చేసి పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube