యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇక ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర( Devara )సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ త్వరలోనే ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 10వ తేదీ విడుదల కానుంది.
ఇక ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2( War 2 ) లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.అలాగే కేజిఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel )డైరెక్షన్ లో కూడా ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయినటువంటి ఎన్టీఆర్ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.ఇదిలా ఉండగా తాజాగా ప్రశాంత్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే సినిమా గురించి ఇటీవల ఒక కీలక అప్డేట్ ఇచ్చారు.ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఎవరు నటించబోతున్నారు అనే విషయం గురించి ఒక వార్త సంచలనంగా మారింది.

ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రష్మిక( Rashmika ) నటిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమాలో రష్మిక నటించాలి అంటే ఆమె డైరెక్టర్ కి ఒక కండిషన్ పెట్టారని సమాచారం.ఎన్టీఆర్ సినిమాలో రష్మిక నటించిన అంటే ఎన్టీఆర్ పక్కన తనని గ్లామర్ గా చూపించాలి కానీ డీ గ్లామర్ పాత్రలో చూపించకూడదనే కండిషన్ పెట్టారట ఇప్పటికే పుష్ప సినిమాలో అలాంటి పాత్రలో కనిపించిన ఈమె మరోసారి అలాంటి డీ గ్లామర్ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమాకు ఏకంగా ఏడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.








