ఏపీలో వైసీపీ( YCP ) ఓటమి పాలవడంతో అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్( AAG Ponnavolu Sudhakar Reddy ) రెడ్డి రాజీనామా చేశారు.ఈ క్రమంలో రాజీనామా లేఖను సీఎస్ జవహర్ రెడ్డికి పంపారు.
ఏఏజీ పొన్నవోలుతో పాటు రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డి కూడా రాజీనామా చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం కోర్టు సెలవులు కావడంతో త్వరలోనే ఏజీపీ, ఏపీపీలు రాజీనామా చేసే ఛాన్స్ ఉందని సమాచారం.
కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే.