ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ప్రస్తుత సీఎస్ జవహార్ రెడ్డి సెలవుపై వెళ్లారు.
అయితే సీఎస్ జవహార్ రెడ్డి ( cs jawahar reddy)సెలవుపై వెళ్లాలని ఆదేశాలు వచ్చాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే సాయంత్రంలోగా కొత్త సీఎస్ నియామకం జరగనుందని సమాచారం.
అదేవిధంగా సలహాదారులను సైతం తక్షణం పదవుల నుంచి తప్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది.కాగా ఇప్పటికే అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రావత్ సెలవుపై వెళ్లారు.
ఈ తరహాలోనే కొత్త ప్రభుత్వం త్వరలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది.