ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ( TDP alliance)విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Telangana CM Revanth Reddy ) ఫోన్ చేశారు.
ఈ క్రమంలో ఈ నెల 12వ తేదీన సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగిద్దామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న అంశాలతో పాటు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని సమాచారం.