ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.మొదటినుండే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని జాగ్రత్త పడిన పవన్.ఆ రకంగానే బీజేపీ, టీడీపీ( BJP, TDP ) పార్టీలను ఏకతాటి పైకి తీసుకొచ్చారు.2014లో మాదిరిగా బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు 2024 ఎన్నికలలో పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగాయి.పోటీ చేసిన అన్నిచోట్ల జనసేన గెలవడం జరిగింది.దీంతో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.“సార్వత్రిక ఎన్నికల్లో జనసేన( Janasena ) సాధించిన అఖండ విజయాన్ని అభినందిస్తూ నలుచెరగుల నుంచీ శుభాకాంక్షలు అందిస్తున్నారు.

 Pawan Kalyan Thanked Everyone Janasena, Pawan Kalyan , Ap Politics , Tdp Allian-TeluguStop.com

రైతాంగం, కార్మిక లోకం, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు, మేధావులు, మహిళలు, యువత, సామాజికవేత్తలు… ఇలా ప్రతీ వర్గం ఈ విజయంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ కథానాయకులు, నటులు, నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు హర్షాన్ని తెలియచేస్తూ శుభాకాంక్షలు అందించారు.తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ చిత్ర పరిశ్రమలకు చెందిన శ్రేయోభిలాషులు తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సాధించిన విజయాన్ని స్వాగతిస్తూ శుభాకాంక్షలు వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.ఈ విజయం మా అందరిపై బాధ్యతను మరింత పెంచింది.

రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తాము”.అని పవన్ తెలియజేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube