ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )తనదైన రీతిలో వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన కొడుకు అయిన అకిరా నందన్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలయితే వస్తున్నాయి.
ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తన కొడుకుని వెంటేసుకొని తిరుగుతున్నాడు.
![Telugu Akira Nandan, Narendra Modi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Latest N Telugu Akira Nandan, Narendra Modi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Latest N](https://telugustop.com/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-Narendra-Modi-Pithapuram-Assembly-constituency-tollywood-social-media.jpg)
ఇక ప్రధానమంత్రి మోడీ( Narendra Modi )ని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా తన కొడుకు అయిన అఖీరా నందన్ ను వెంటబెట్టుకొని వెళ్లాడు.అలాగే తనతో పాటుగా తన కొడుకును కూడా తిప్పుతూ ఉండడంతో ఇది చూసిన చాలామంది ఇక తొందర్లోనే అకిరానందన్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలను సైతం వైరల్ చేస్తున్నారు.ఇక అకిరా నందన్ చూడ్డానికి అచ్చం హీరోల ఉన్నాడు.
అలాగే హైట్ లో కూడా బావుండడం, ఫిజికల్ గా హీరోని మైమరిపించే బాడీతో ఉండడంతో ఆయన మీద ఇలాంటి రూమర్లైతే వస్తున్నాయి.ఇక ఆయనకి సినిమాలు చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటికే రేణు దేశాయ్( Renu Desai( అకిరానందాన్ కి అయితే సినిమాలు చేసే ఇంట్రెస్ట్ లేదు అని చెప్పింది.
![Telugu Akira Nandan, Narendra Modi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Latest N Telugu Akira Nandan, Narendra Modi, Pawan Kalyan, Renu Desai, Tollywood-Latest N](https://telugustop.com/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-Narendra-Modi-Pithapuram-tollywood.jpg)
తను చెప్పినట్టుగానే మరి అకిరా నందన్ కి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకునే లోపు అకిరానందన్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసి తను సినిమాల నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది…చూడాలి మరి పవన్ కళ్యాణ్ తన కొడుకుని హీరోగా ఎప్పుడు పరిచయం చేస్తాడు అనేది…ఇక మొత్తానికైతే అకీరా నందన్ ఎంట్రీ తప్పకుండా ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నారు.