ఏపీలో ( AP ) అత్యంత భయానక వాతావరణం నెలకొందని ట్విట్టర్ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్( YS Jagan ) తెలిపారు.ప్రభుత్వం ఏర్పడకముందే టీడీపీ ముఠాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.వైసీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు.
అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని తెలిపారు.ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు.గవర్నర్ ( Governor ) వెంటనే జోక్యం చేసుకుని అరాచకాలను అడ్డుకోవాలని జగన్ కోరారు.