విద్వేష నేరానికి పాల్పడిన భారత సంతతి వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు.సెప్టెంబర్ 2022లో 48 ఏళ్ల భూషణ్ అథలే( Bhushan Athale ) అనే వ్యక్తి అమెరికాలో సిక్కుల పౌర హక్కుల కోసం వాదించే ఒక సంస్థ ఫోన్ నెంబర్‌కు ఏడు వాయిస్ మెయిల్స్ పంపాడు.
అందులో సిక్కులపై తీవ్ర ద్వేషాన్ని వ్యక్తం చేస్తూ .ఇదే సంస్థలో పనిచేస్తున్న ఆ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులను రేజర్‌తో గాయపరుస్తానని లేదా చంపేస్తానని అథలే బెదిరించాడు.
గతేడాది మార్చిలో మరోసారి అదే సంస్థ నంబర్‌కు మరో రెండు వాయిస్ మెయిల్స్‌ను పంపాడని , ఈసారి సిక్కులు, ముస్లింలకు వ్యతిరేకంగా హింసాత్మక చిత్రాలను ఉపయోగించాడని పోలీసులు అభియోగాలు మోపారు.అథలే మతపరమైన వ్యాఖ్యలు , బెదిరింపులకు పాల్పడటం ఇదే తొలిసారి కాదని అమెరికా న్యాయశాఖ పేర్కొంది.
అతను పాకిస్తాన్ , ముస్లింలను ద్వేషిస్తున్నాడని తెలిపింది.ఈ కేసులో అథలే దోషిగా తేలితే .ఫెడరల్ ప్రొటెక్టెడ్ యాక్టివిటీస్‌లో ( Federally Protected Activities )జోక్యం చేసుకున్నందుకు పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు మరో ఐదేళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

ఇకపోతే.గతేడాది న్యూయార్క్ నగరంలో భారత సంతతికి చెందిన సిక్కు వృద్ధుడు జస్మర్ సింగ్( Jasmar Singh ) (66)పై జరిగిన జాతి విద్వేష దాడి తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.‘‘ టర్బన్ మ్యాన్ ’’( Turban Man ) అని పిలుస్తూ వృద్ధుడిపై దుండగుడు విచక్షణారహితంగా దాడి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు.
ఈ నేరానికి సంబంధించి నిందితుడిపై నరహత్య, దాడి, ద్వేషపూరిత నేరం అభియోగాలు మోపినట్లు ప్రాసిక్యూటర్లు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన పోలీసులు అక్టోబర్ 20న నిందితుడు గిల్బర్ట్ అగస్టిన్‌ను అరెస్ట్ చేశారు.ఇతనిపై నరహత్య, దాడి అభియోగాలు మోపినట్లు డైలీ న్యూస్ నివేదించింది.అక్టోబర్ 19న క్యూ గార్డెన్స్‌లోని హిల్‌సైడ్ అవెన్యూ ( Hillside Avenue in Kew Gardens )సమీపంలో వాన్ విక్ ఎక్స్‌ప్రెస్ వేపై సింగ్.
అగస్టిన్ వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి.రెండు కార్లపై గీతలు వున్నట్లుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనపై సింగ్ 911కి కాల్ చేస్తుండగా .అగస్టిన్ అతని చేతిలోని ఫోన్ లాక్కున్నట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు.ఈ వాగ్వాదం ముగిశాక.సింగ్ తన ఫోన్‌ను తీసుకునేందుకు గాను అతనిని అనుసరించాడు.ఎట్టకేలకు తన ఫోన్ సంపాదించి తన కారు దగ్గరికి వెళ్తున్న సింగ్‌ను అగస్టిన్ వెనుక నుంచి తల, ముఖంపై పదే పదే కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.దీంతో సింగ్ నేలపై కూలిపోయాడు.
అయినప్పటికీ అగస్టిన్ అతనిని వదిలిపెట్టకుండా కొడుతూనే వున్నాడు.కొద్దిసేపటికి తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.