ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ప్రమాణ స్వీకారం చేయకముందే పూర్తి స్థాయిలో తన పరిపాలనా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారు.ఏ ఏ స్థానాల్లో ఎవరిని అధికారులుగా నియమించాలి అనే విషయం పైనా ప్రత్యేకంగా ఫోకస్ చేశారు.
ఏపీ సి ఎస్, డీజీపీ నియామకం పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ( Nirab Kumar Prasad )ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పటి వరకు ఏపీ సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి సెలవు పై వెళ్లారు .ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు.ఇక కొత్త సిఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ వివరాలు పరిశీలిస్తే .1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి.ఏపీలో రెవెన్యూ తో సహా అనే కీలక శాఖలో పనిచేసిన అనుభవం ఉంది.గతంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ గా ఆయన వ్యవహరించారు.

ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ , అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.గతంలోనూ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉంది.ఇటీవల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత చంద్రబాబుతో నీరబ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.మొదటగా నీరబ్ లేదా విజయానంద్ పేర్లను సిఎస్ గా నియామకం కోసం చంద్రబాబు పరిశీలించారు.
అయితే చంద్రబాబు సీఎస్ గా రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న నీరభ్ కుమార్ ప్రసాద్ వైఫై చంద్రబాబు మొగ్గు చూపించారు.ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి( Jawahar Reddy ) సెలవు వెళ్లడంతో , ఆయనను సిఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.