టీడీపీ అధినేత చంద్రబాబు రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు.ఈ మేరకు టీడీపీ (TDP)ఎంపీలతో చంద్రబాబు(Chandra Babu) సమావేశం కానున్నారు.
అందుబాటులో ఉన్న ఎంపీలు తన నివాసానికి రావాలని చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.కాగా ఇప్పటిక పలువురు ఎంపీ ఢిల్లీ ప్రయాణంలో ఉన్నారు.
రేపు ఎన్డీఏ(NDA) భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఎంపీలతో కలిసి చంద్రబాబు(Chandra Babu) పాల్గొననున్నారు.మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రమాణస్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానాలు అందాయి.
కాగా ఏపీలో ఈ నెల 12వ తేదీన చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.