పాడైపోయిన వస్తువులను ఉపయోగకరమైన పనులకు వాడటంలో ఆడవారి తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవచ్చు.పాత వస్తువుల వాడకం విషయంలో వారికి వచ్చే ఐడియాలు మరెవరికి రావాలంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఒక అమ్మమ్మ తన సృజనాత్మకతతో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది.సాంప్రదాయ మెయిల్ బాక్స్‌ను వాడటానికి బదులు, ఆమె తన ఓల్డ్ మైక్రోవేవ్ ను( Old microwave ) ఒక తెలివైన మెయిల్ బాక్స్‌గా మార్చింది.
అమ్మమ్మ తన ఇంటి ముందు మైక్రోవేవ్‌ను ఉంచి, దాని పై “మెయిల్ బాక్స్” అని రాసింది.మైక్రోవేవ్ డోర్‌పై మరొక లేబుల్ ఉంది, “ప్రెస్ టు ఓపెన్“.
అంటే ఆమె ఒక వంటగది పరికరాన్ని మెయిల్ బాక్స్‌గా మార్చింది! ఒక వైరల్ వీడియోలో ఎవరో అమ్మమ్మను “అమ్మమ్మా, ఇది ఏమిటి?” అని అడిగారు.చిలిపి నవ్వుతో, ఆమె మైక్రోవేవ్ తలుపును తెరిచి, లోపల ఖాళీగా ఉండటం చూపించింది.
ఆపై నవ్వుతూ ఆమె వెళ్ళిపోయింది.
టిక్‌టాక్‌లో మొదట పోస్ట్ అయిన ఈ వీడియో ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయి, 43 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.సోషల్ మీడియా వినియోగదారులు ఆమె క్రియేటివిటీని బాగా పొగిడారు.కొందరు ఆమె సృష్టిని “మెయిల్‌క్రోవేవ్( Mailcrowave )అని పిలుస్తూ కామెంట్లు చేశారు.మరికొందరు ఆమె “రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేయండి.” వంటి మూడు Rలకు ఆమె కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు.
ఈ అమ్మమ్మ మెయిల్ బాక్స్( Mail box) కోసం మాములు పద్ధతులను వదిలివేసి, ఒక అద్భుతమైన ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.పాత మైక్రోవేవ్ ను మెయిల్ బాక్స్‌గా మార్చడం ద్వారా, ఆమె తన క్రియేటివిటీని చాటుకుంది.ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా కూడా ఉంది. మైక్రోవేవ్ లోపల ఎలాంటి కీటకాలు చిక్కుకోలేవు, దీనివల్ల ఆమె తన మెయిల్‌ను సురక్షితంగా ఉంచుకోగలుగుతుంది.