మెగా కోడలు ఉపాసన( Upasana ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) కోడలిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) భార్యగా ఈమె అందరికీ సుపరిచితమే అయితే ఉపాసన మెగా ఇంటి కోడలుగా అడుగు పెట్టకముందే ఈమె అపోలో హాస్పిటల్( Apollo Hospital ) వైస్ ప్రెసిడెంట్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఇలా ఉపాసన మెగా ఇంటికోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఈమె మెగా ఇంటి పరువు ప్రతిష్టలను ఉన్నత శిఖరానికి చేర్చారు.
ఇక ఉపాసన ఇంటి బాధ్యతలను మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటినీ కూడా చక్కబెడుతూ ఉంటారు.అయితే అపోలో హాస్పిటల్ ఫౌండర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి( Prathap Reddy ) గారి మనవరాలుగా ఉపాసన మరింత పేరు ప్రఖ్యాతలు పొందారు.అయితే తాజాగా ఉపాసన తాతయ్య ప్రతాపరెడ్డి కారుకు ప్రమాదం జరిగిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈయన తన కారులో చెన్నైలో( Chennai ) వెళుతూ ఉండగా ఒక వ్యాన్ కారు పైకి దూసుకు వచ్చింది .ఈ ప్రమాదంలో ప్రతాపరెడ్డి స్వల్ప గాయాలు పాలయ్యారని తెలుస్తోంది.
ఇలా ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాద ఘటనపై చెన్నై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.అయితే ఎవరు భయపడాల్సిన పనిలేదని ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తుంది.ఇక ఉపాసన ఎప్పుడు కూడా తన తాతయ్య గురించి ఎన్నో సందర్భాలలో గొప్పగా చెప్పారు.తన తాతయ్య తనకు ఇన్స్పిరేషన్ గా నిలిచారని ఉపాసన పలు సందర్భాలలో వెల్లడించారు.
ఇక ఇటీవల తన తాతయ్య పుట్టినరోజు సందర్భంగా తన తాత కీర్తి ప్రతిష్టల గురించి ఓ పుస్తకాన్ని కూడా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.ఇక తన తాతయ్య స్థాపించిన అపోలో హాస్పిటల్స్ ను ఉపాసన ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.