హైదరాబాద్( Hyderabad) నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.ఖైరతాబాద్, అంబర్ పేట్, బేగంపేట్ ప్రాంతాల్లో వాన పడుతోంది.
అదేవిధంగా సికింద్రాబాద్ సర్కిల్( Secunderabad ) పరిధిలో జోరుగా వర్షం కురుస్తోంది.పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది.
దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పలు కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.అయితే గడిచిన 24 గంటల వ్యవధిలో నగరంలో రెండోసారి భారీ వర్షం కురుస్తుంది.
భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు.ఈ మేరకు రంగంలోకి దిగిన అధికారులు, సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.