హైదరాబాద్ జూన్ 06:ఈ విద్యా సంవత్సరం (2024-25) కు సంబంధించి ఈరోజు నుంచి ఈనెల 19వ తేదీ వరకు బడిబాట కార్యక్ర మాన్నీ నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల జిల్లా, మండల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను చేసింది.
ఈనెల 12న పాఠశాలలు పున.ప్రారంభం కానున్న నేపథ్యం లో బడిడు విద్యార్థులంద రిని బడిలో చేర్పించేందుకు జయశంకర్ బడిబాట( Badi Bata ) పేరుతో కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టింది.అన్ని ప్రభుత్వ శాఖల అధి కారులు కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించను న్నారు.దీంట్లో బాగంగా అన్ని అవసాల్లో తిరిగి బడిఈడు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలల్లో చేర్పించి విద్యార్థుల సంఖ్య పెంచడంతోపాటు నాణ్యమై న విద్య అందించనున్నారు.
అంగన్ వాడి కేంద్రాల్లో( Angan Wadi Centres ) పాఠ శాల వయస్సు పిల్లలను 1వ తరగతిలో, 5వ తరగతి పూర్తి చేసిన వారిని అప్పర్ ప్రయిమరి హైస్కూళ్లలో, 7,8 తరగతులు పూర్తి చేసిన పిల్లలను హైస్కూ ళ్లలో చేర్పించనున్నారు.మండల, గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి బడిబాటను విజయ వంతం చేసేలా చర్యలు తీసుకోనున్నారు.
వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంఈ కార్యక్రమాన్నీ రేడి యో,టెలివిజన్, వార్త పత్రికలు,సోషల్ మీడియా వంటి స్థానిక మీడియా ఛానెళ్ళ ద్వారా ప్రచారం చేయనున్నారు.మండల స్థాయిలో మండలస్థాయి, గ్రామాల్లో గ్రామస్థాయి అధికారులను సైతం కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తారు.
మొదటి రోజు అనగా గురువారం నుంచి 11వ తేదీ వరకు అన్ని పాఠశా లల్లో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు గ్రామ సమైక్య సంఘాలతో సమావేశమై కార్యక్రమం అమలు తీరుపై చర్చిస్తారు.గ్రామాల్లో ర్యాలీలు, కరపత్రాలు పంపిణీతో ఇంటింటా ప్రచారం, అంగన్ వాడి కేంద్రాల సందర్శన, ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న వసతుల,విద్యా బోధన తదితర అంశాలను వివరిస్తారు.12న పాఠశాలలు తెరుచుకొనున్న సందర్భంగా పిల్లలు,తల్లిదండ్రులకు స్వాగతం పలుకుతా రు.సమావేశం ఏర్పాటు చేస్తారు.13 నుంచి 19 వరకు అర్హత ఉండి చదువుకోలేని పరిస్థి తిలో ఉన్న విద్యార్థులను గుర్తించి పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తారు.పిల్లల వివరా లను యాప్ లో నమోదు చేస్తారు.
మండలంలో జీరో ఎస్ రోల్ మెంట్ తో మూతబడిన పాఠశాలలను ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు చేరితే తిరిగి తెరుస్తారు బడిబాట ఆఖరి రోజు అన్ని తరగతి విద్యార్థులను పాఠశాలలకు రప్పించి క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.