హైదరాబాద్ లోని జలసౌధలో కృష్ణా బోర్డు సమావేశం కొనసాగుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్( Srisailam, Nagarjuna Sagar ) ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తుంది.
బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి నిధుల విడుదలపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోందని తెలుస్తోంది.అయితే శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులతో పాటు వాటికి సంబంధించిన పదిహేను అవుట్ లేట్ లు, ఆస్తులు మరియు ఉద్యోగులను బోర్డుకు అప్పగించాలని రెండు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి ఆదేశాలు జారీ చేసింది.దీనికి ఏపీ ఒప్పుకోగా.ప్రాజెక్టును బోర్డుకు ఇచ్చేందుకు తెలంగాణ ససేమిరా అంటుంది.ఈ క్రమంలోనే ముందు కృష్ణా న( Krishna river )దిలో వాటా తేల్చాలంటూ తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) పట్టు పడుతుంది.ఈ నేపథ్యంలోనే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇవాళ సమావేశాన్ని నిర్వహిస్తోంది.