నేడు తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డి బృందం

హైదరాబాద్:ఆగస్టు 14విదేశీ పర్యటన ముగించు కుని తెలంగాణకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రానుంది.ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్( Revanth reddy ) బృందం చేరుకోనుంది.ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతి నిధి బృందం అమెరికా( America )కు వెళ్లింది.10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియో ల్‌కి చేరుకున్నారు.దక్షిణ కొరియాలో రెండ్రోజుల పాటు రేవంత్ పర్యటిం చారు.పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా లో పర్యటించారు.అక్కడ పలు కంపెనీలతో ఎంవో యూలు చేసుకున్నారు.

 Cm Revanth Reddy's Team For Telangana Today, Revanth Reddy, Cm Revanth Reddy ,-TeluguStop.com

అందులో భాగంగా కాగ్ని జెంట్‌తో చేసుకున్న ఒప్పం దం మేరకు… వచ్చి రాగానే కోకాపోటలో కొత్త క్యాంప స్‌కి రేవంత్ రెడ్డి శంకుస్థా పన చేయనున్నారు.

ఈ నెల 5న తెలంగాణ సర్కార్‌తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంవోయూ చేసుకుంది.ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు.అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది.తెలంగా ణను పెట్టుబడుల గమ్యస్థా నంగా అమెరికాలోని పారి శ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు.

పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్‌లు నిర్వ హించి పలు కంపెనీలను క్షేత్ర స్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు.తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందు కు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకు వచ్చాయి.

ఈ పర్యటనలో 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టు బడుల కోసం 19 కంపెనీల తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.దీంతో రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

దక్షిణ కొరియా( South Korea )లో పలు వురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం.కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్​తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వ హించి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రా నిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతిని ధులతోనూ సీఎం చర్చలు జరిపారు.హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌ తో భేటీ అయ్యారు.

శామ్‌ సంగ్ హెల్త్ కేర్ యూనిట్‌తో సమావేశమై చర్చలు జరిపారు.అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి బృందం సందర్శించింది.

కాల్‌టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టు బడులపై చర్చలు జరిపింది.ఇప్పటికే వరంగల్ టెక్స్​టైల్స్ పార్కులో పెట్టుబ డులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube