నల్లగొండ జిల్లా:అందరికీ పరిసరాల పరిశుభ్రత పాటించమని చెప్పే ఎంపిడిఓ కార్యాలయం ముందే రెండు నెలలుగా బురద దర్శనం ఇస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లా( Nalgonda District ) వేములపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం గేటు ముందు గుంత ఏర్పడి, అందులో వర్షపు నీరు నిలిచి,గత రెండు నెలలుగా బురదను దాటుకుంటూ వెళుతూ ఇబ్బంది పడుతున్నామని, స్వచ్చదనం-పచ్చదనం( Cleanliness -greenness ) గురించి అందరికీ చెప్పే అధికార కార్యాలయం ముందే ఈ అపరిశుభ్రత ఏంటి సార్లూ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇది చాలదన్నట్లుగా ఆఫీస్ పరిసరాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని,ఆఫీస్ పరిసరాల్లో ఉండాలంటే దొమలతో ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వెంటనే మరమ్మతులు చేపట్టి, పిచ్చి మొక్కలు లేకుండా తొలగించాలని కోరుతున్నారు