గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి.ఇందులో భాగంగ కాచిగూడ వార్డు కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ తెలిపారు.ప్రజల వద్దకే ప్రభుత్వ అధికారులు వస్తారని చెప్పారు.
నగర పౌరులకు పాలన మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో 150 డివిజన్లలో వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీలో వార్డుకు ఒక అధికారిని నియమిస్తామని పేర్కొన్నారు.
అధికారులు ప్రజలకు చేరువగా ఉండి సమస్యలను పరిష్కరిస్తారని కేటీఆర్ వెల్లడించారు.