హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి స్వైర విహారం చేశాయి.టప్పాచబుత్రలో కుక్క కాటుకు ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సీసీ టీవీ కెమెరాల్లో కుక్క దాడికి పాల్పడిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.బాలుడి తల్లి వెంటనే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది.వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే హైదరాబాద్ లో చిన్నారులకు కుక్కలు దాడికి పాల్పడగా ప్రాణాలు కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ చర్యలు కూడా తీసుకుంది.
అయితే కుక్క దాడి ఘటన మరోసారి చోటుచేసుకోవడంతో అధికారులు సరైన చర్యలు తీసుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.