తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాస

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన తెలంగాణ టీడీపీ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది.రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతుండగా కొందరు నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు.

 Telangana Tdp Workers Meeting Rasabhasa-TeluguStop.com

ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు నేతలు, పోటీ చేయొద్దని కొందరు నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సమావేశంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.తక్షణమే పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీ విషయంపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో కార్యకర్తలకు కాసాని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదని తెలుస్తోంది.మరోవైపు దమ్ముంటే కాసాని ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మరి కొందరు నేతలు సవాల్ విసిరారని తెలుస్తోంది.

దీంతో ఉద్రిక్తత నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube