ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్

తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆగస్ట్ 15 వరకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతా మని ప్రకటించింది.అందు కు అనుగుణంగా ఇప్పటికే రెండు విడుతాల్లో చేసిన ప్రభుత్వం మూడో విడత నిధులను ఖమ్మం( Khammam )లో విడుదల చేయనుంది.రాష్ట్రంలో మొత్తం రుణాలు తీసుకున్న రైతులు 32.50 లక్షల మంది ఉన్నారు.రైతు లను రుణ విముక్తులను చేసేందుకు 31 వేల కోట్ల రుణమాఫీకి అవసరం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది.

 The Telangana Government Is Ready For The Third Installment Of Loan Waiver On Au-TeluguStop.com

ఈ ఏడాది జులై 15న రుణమాఫీ జీవో జారీ చేసిన ప్రభుత్వం మూడు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతా ల్లో నిధులు జమ చేసింది.జులై 18న మొదటి విడ తగా లక్ష రూపాయల స్లాబ్ వరకు రుణమాఫీ చేసింది.11లక్షలా 14వేల 412 మంది రైతులకు 6వేల 34.97 కోట్లు విడుదల చేసింది.జులై 30న అసెంబ్లీ వేదికగా రెండో విడత రుణమాఫీ కార్యక్రమం నిర్వహించింది.

లక్ష నుంచి లక్షా 50 వేల వరకు రుణాలున్న రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసింది.దాదాపు 6లక్షలా 40వేల 823 మంది రైతుల ఖాతా ల్లో 6వేల190.01 కోట్లు జమ చేసింది.12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుం బాలకు 12 వేల కోట్లకుపైగా రుణమాఫీ నిధులు జమ చేసింది.ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడో విడత పంట రుణ మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.

అమెరికా పర్యటన( America ) నుంచి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Chief Minister Revanth Reddy )ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ కార్యక్రమంలో పాల్గొనను న్నారు.మూడో విడతలో లక్షా 50 వేల నుంచి 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తారు.

రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నిధు లను జమ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube