యాదాద్రి భువనగిరి జిల్లా:కేంద్రంలో ఓ ప్రముఖ కిరాణా జనరల్ స్టోర్ గుట్కా వ్యాపారానికి గుత్తేదారుగా మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక్కడి నుండే జిల్లా మొత్తంగా సరఫరా చేస్తున్నా సంబధిత అధికారులు పట్టించుకోకపోవడంపై గుట్కా విక్రయాలు చట్ట బద్దం చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతేకాకుండా సదరు వ్యాపారి జీరో టాక్స్ తో నాణ్యతలేని వస్తువులతో వ్యాపారం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఈ జనరల్ స్టోర్స్ జిల్లా కేంద్రంలో ప్రధాన బిజినెస్ ఏరియాలో ఉండడంతో రోజుకు వేల మంది కొనుగోలు చేస్తూ మోసపోతున్నారని,జీరో టాక్స్ వస్తువులకు మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉండదని,ఎక్స్పైరీ డేట్ ఉండదని అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ప్రజలను మోసం చేస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి వ్యాపారాలపై ఉక్కు పాదం మోపాలని కోరుతున్నారు.







