హైదరాబాద్ లో దారుణ హత్య జరిగింది.ఆస్తి కోసం కన్నతల్లినే కడతేర్చాడు ఓ కొడుకు.
ఈ దారుణ ఘటన రామంతపూర్ లో చోటు చేసుకుంది.
భార్య, స్నేహితుడి సహకారంతో తల్లిని అనిల్ అనే వ్యక్తి హత్య చేశాడు.
అంత్యక్రియలు చేస్తున్న సమయంలో కొందరు బంధువులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇళ్లును అమ్మమని కొడుకు, కోడలు కోరగా ఆమె నిరాకరించింది.
దీంతో పక్కా ప్రణాళిక మేరకు సుగుణమ్మను దారుణంగా హత్య చేశారని తెలుస్తోంది.బంధువుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలోనే ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
.






