తెలంగాణలో వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం అందించే న్యూట్రిషన్ల కిట్లతో ఒక తరం ఆరోగ్యంగా పెరుగుతుందని కేసీఆర్ తెలిపారు.వైద్య రంగం ఇంకా గొప్పగా ఉండాలన్న ఆయన అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు.
కరోనా వంటి క్లిష్ట సమయంలో గాంధీ ఆస్పత్రి సేవలు అద్భుతమని కొనియాడారు.







