బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రస్తుతం షారుక్ ఖాన్ వరుసగా సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా షారుఖ్ ఖాన్ ఇటీవలె పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కోట్లలో బడ్జెట్ ని రాబట్టడంతో పాటు బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.
షారుఖ్ కి సాలిడ్ హిట్ పడడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.పఠాన్ ఇండియా లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే మరొకవైపు జవాన్ సినిమాలో నటిస్తున్నాడు షారుఖ్ ఖాన్.

ఇది ఇలా ఉంటే షారుఖ్ ఖాన్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటాడు.అభిమానులతో సరదాగా లైవ్ చాట్ నిర్వహిస్తూ ఉంటాడు.తాజాగా కూడా షారుఖ్ ఫ్యాన్స్ తో ఆస్క్ ఎస్ఆర్కే( Ask SRK ) అనే చాట్ సెషన్ నిర్వహించాడు.
షారుఖ్ ని ఫ్యాన్స్ అనేక ప్రశ్నలు అడగగా ఆ ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు.ఈ క్రమంలోనే ఒక అభిమాని.షారుఖ్ భాయ్ భోజనం చేశారా అని ప్రేమగా అడిగాడు.వెంటనే షారుఖ్ స్పందిస్తూ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.
ఎందుకు బ్రదర్.నాకోసం స్వైగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తావా? అని సమాధానం ఇచ్చాడు.ఇక షారుఖ్ ఖాన్ నోటి నుంచి స్విగ్గి అనే పదం రావడంతో వెంటనే సిగ్గు వారు అలర్ట్ అయ్యారు.

ఒకరు ఇద్దరు కాదండో ఏకంగా పదిమంది స్విగ్గీ డెలివరీ బాయ్స్( Swiggy’s Delivery Boys ) షారుఖ్ కి ఫ్రీగా ఫుడ్ డెలివరీ చేసేందుకు ఆయన మన్నత్ ఇంటి ముందు వాలిపోయారు.మాయా స్విగ్గి బాయ్స్ మీ కోసం ఫుడ్ తీసుకువచ్చారు అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది.స్విగ్గీ పబ్లిసిటీ యాక్ట్ చూస్తుంటే ఇది మామూలు వాడకం కాదు అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
కాగా స్విగ్గి వారు చేసిన పనికి షారుఖ్ ఖాన్ షాక్ అయ్యారు.







