యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో దీర్ఘకాలికంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన 16 మంది ఉపాధ్యాయులను ఏక కాలంలో సర్వీస్ నుంచి తొలగిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా డిఈవో సత్యనారాయణ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది.జిల్లాలోని పలు పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉపాధ్యాయులు 2005 నుంచి కూడా సెలవులో ఉంటూ సంవత్సరాలుగా విధులకు హాజరు కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
విధులకు హాజరు కాని ఉపాధ్యాయులకు పలుమార్లు నోటీసులు ఇచ్చినా,వేతనాలను నిలిపివేసినా స్పందన లేకపోవడంతో సర్వీస్ నుంచి పూర్తిగా తొలగిస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.