దేశంలో సార్వత్రిక ఎన్నికల వాతావరణం హోరాహోరీగా ఉంది.ఇప్పటికే మూడు దశల ఎన్నికలు పూర్తయ్యాయి.
మే 13వ తారీకు నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం ఏడు దశలలో ఎన్నికలు జరగబోతున్నాయి.
నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయి.ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఇదిలవుండగా కేంద్రంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా ఉంది.మూడో సారి ఎలాగైనా గెలవాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.400 స్థానాలు గెలవడం టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది.
దీంతో ఎన్డీఏ మిత్ర పక్షాలతో కలిసి ఎలక్షన్స్ ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.కేంద్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.ఈ సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి 220-230 సీట్లు వస్తాయని అంచనా వేశారు.ఈసారి ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ ప్రభుత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామ్యం అని పేర్కొన్నారు.తాము అధికారంలోకి వచ్చాక ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు.
గుజరాత్ కి చెందిన వ్యక్తి కాకుండా ఢిల్లీకి పీపుల్స్ గవర్నర్ ఉంటారని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.