10 రోజుల్లో స్టోరీ రాసి, మూడు నెలలు సినిమా తీసి ఇండస్ట్రి హిట్టు కొట్టగలిగే ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్( Puri Jagannath ).ప్రస్తుతం ఈయన కొంచెం స్ట్రగులింగ్ లో ఉన్నప్పటికీ ఇప్పుడు చేయబోయే డబుల్ ఇస్మార్ట్ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో ఇండియా వైడ్ గా తెలియజేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్టు’ ( Double ISmart )అనే సినిమా నుంచి కొన్ని అప్డేట్లు కూడా బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా పాన్ ఇండియాలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇంతకుముందు ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.మరి ఆ రీతిలోనే ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ సాధిస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.ఒకవేళ ఈ సినిమాతో కనుక సూపర్ సక్సెస్ అందుకుంటే రామ్( Ram ) కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచిపోతుందనే చెప్పాలి.అలాగే తనకు పాన్ ఇండియాలో మంచి క్రేజ్ అయితే ఏర్పడుతుంది.
మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ఈ సినిమా ఎంతటి భారీ విజయాన్ని సాధిస్తుంది అనే దాని మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇస్మార్ట్ శంకర్ ను మించి డబుల్ ఇస్మార్ట్ ఉండబోతుంది అనే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది.ఇక ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధిస్తుంది అనేది మనం కచ్చితంగా చెప్పలేం…ఇక ఈ సినిమాతో పూరి కూడా మరో సారి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.మరి ఈ ఒక్క సినిమాతో ఇద్దరికీ భారీ సక్సెస్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.







