రేపు ఏపీ తెలంగాణలో ఎన్నికల పోలింగ్ జరగబోతుంది.ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ కు, తెలంగాణలో పార్లమెంట్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.
దీంతో ఓట్లు వేసేందుకు జనాలు సిద్ధం అయిపోయారు.ఏపీకి చెందినవారు ఎక్కువమంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడం, వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో, అందరూ తమ సొంత ఊళ్లకు ఓట్లు వేసేందుకు బయలుదేరారు.
దీంతో బస్సులు, రైళ్ల ద్వారా భారీగా తరలి వెలుతున్నారు.టిక్కెట్లు దొరకని వారు సొంత వాహనాలు, ప్రైవేట్ కార్లు, బస్సులలో ( own vehicles, private cars, buses )పయనం అవుతున్నారు .దీంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి.ఆదివారాలు సెలవులు కావడం, సోమవారం పోలింగ్ రోజున అనధికారిక సెలవు ప్రకటించడంతో సొంత సొంత ఊళ్లకు బయలుదేరి వెళుతున్నారు ఎక్కువమంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కావడంతో, ఏపీ రోడ్లన్నీ రద్దీ గా మారాయి.

నిన్నటి నుంచి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది.ఏపీ వైపునకు వెళ్లే వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో, టోల్ ప్లాజాల వద్ద గేట్లను తెరిచి ఉంచారు.విశాఖ, విజయవాడ, శ్రీకాకుళం ( Visakha, Vijayawada, Srikakulam )వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు సొంత వాహనాల్లో చాలామంది బయలుదేరారు.ఇక ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్లు దొరకకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వీరంతా సొంత ఊళ్లకు బయలుదేరి వెళ్తుండడం ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తుండడంతో ఎక్కువ మంది సొంత వాహనాల్లో వెళ్లేందుకే మొగ్గు చూపిస్తున్నారు.

ఈసారి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు( Assembly Elections in AP ) అత్యంత ప్రతిష్టాత్మకం కావడం తో ,ఏపీకి చెందిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఎక్కువమంది ఉంటే వారిని రప్పించేందుకు అభ్యర్థులే వాహనాలను సమకూర్చుతున్నారట.ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి వలస వెళ్లిన వారు ఎక్కువ మంది ఉండడంతో హైదరాబాద్ నుంచి వారిని తీసుకువచ్చేందుకు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసి, అభ్యర్థులే ఆ ఖర్చును భరిస్తున్నారట.ఈసారి ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో టిడిపి, వైసిపిలు భారీగా ఖర్చు పెట్టేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు.
దీంతో ఈసారి ఏపీ ఎన్నికల్లో భారీగా ఓటింగ్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది.