మనలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ దాగి ఉంటుంది.ఒకరు చేసిన పనిని మరొకరు అదే ఖచ్చితత్వంతో చేయడం చాలా కష్టం.
చాలామంది తమకంటూ ఓ స్పెషల్ టాలెంట్ కలిగి ఉండడం సహజమే.కొందరు చదువుల్లో టాప్ మార్కులు సాధించి విజయం సాధించగా మరి కొందరు బిజినెస్ రంగంలో టాప్ పొజిషన్ కి చేరుకుంటారు.
అలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన టాలెంట్ తో వారి జీవనాన్ని కొనసాగిస్తుంటారు.
ఇకపోతే కొందరు వాహనాలు నడిపించడంలో కూడా వారి టాలెంట్ ను చూపిస్తుంటారు.అందరిలా నడపడం కాకుండా కాస్త వెరైటీగా వాహనాలు నడిపించే టాలెంట్ ను కలిగి ఉంటారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక వైరల్ వీడియోలు ట్రెండ్ అవుతూ ఉంటాయి.
అందులో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే మరికొన్ని భయభ్రాంతులకు చేసే వీడియోలు కూడా ఉంటాయి.అలాగే కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి.ఇకపోతే తాజాగా జెసిబి ఆపరేటర్ ( JCB Operator )సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
జెసిబి డ్రైవర్ తన ముందున్న పిల్లకాల్వను చాలా చాకచక్యంతో జెసిబిని ఒకవైపు నుండి మరోవైపుకు తీసుకువెళ్తాడు.వీడియోలో గమనించినట్లయితే జెసిబి ఆపరేటర్ కాస్త డిఫరెంట్ గా ఆలోచించి జెసిబితో మెల్లగా కాల్వ నుంచి వెళ్లేలా డ్రైవ్ చేస్తాడు.అలా ముందు జెసిబి లో ఒకేసారి ముందు భాగం, వెనుక భాగం రెండు సైడ్లలో ఆపరేట్ చేసే విధానం అందుబాటులో ఉండగా దాన్ని ఉపయోగించి అతడు జెసిబినీ ముందుకు పోనిచ్చి ఆ తర్వాత మెల్లగా రివర్స్ లో మరోవైపు కూర్చొని వెనుక భాగంతో జెసిబిని అక్కడి భూమి మీద ఉంచి మరోవైపుకు వెళ్లేలా జెసిబిని నడిపిస్తాడు.ప్రస్తుతం ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ ఆ జెసిబి ఆపరేటర్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.