ప్రస్తుత వేసవి కాలంలో( Summer ) చాలా మందికి తరచూ వేడి చేస్తుంటుంది.ఒంట్లో వేడి ఎక్కువ కావడం వల్ల తీవ్రమైన తలనొప్పి, చిరాకు, జ్వరం, కళ్ళు మంటలు తదితర సమస్యలన్నీ తలెత్తుతుంటాయి.
ఈ క్రమంలోనే బాడీ హీట్ ను( Body Heat ) తగ్గించుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూసులు వంటివి తీసుకుంటూ ఉంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే పొడి వాటికంటే పవర్ ఫుల్ గా పని చేస్తుంది.
ఈ పొడిని తీసుకుంటే ఒంట్లో వేడి మొత్తం ఆవిరి అయిపోతుంది.దెబ్బకు మీరు కూల్ అయిపోతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం బాడీని కూల్ చేసే ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా రెండు కట్టలు పుదీనా( Mint Leaves ) తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.
ఆపై పుదీనాను పూర్తిగా ఎండబెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో బాగా ఎండిన పుదీనా ఆకులు వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర,( Cumin ) రెండు టేబుల్ స్పూన్ సోంపు,( Fennel Seeds ) హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకుని పొడి మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక బాక్స్ లో నిప్పుకుని స్టోర్ చేసి పోవాలి.

ఇప్పుడీ పొడిని ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఫ్రెష్ పెరుగు( Fresh Curd ) వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ తయారు చేసి పెట్టుకున్న పొడి, రెండు ఐస్ క్యూబ్స్ మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మంచి సమ్మర్ డ్రింక్( Summer Drink ) సిద్ధమవుతుంది.

రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక్ తీసుకుంటే శరీరంలో వేడి మొత్తం తగ్గిపోతుంది.ఈ డ్రింక్ బాడీకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ ను ఇస్తుంది.అలాగే నీరసం, అలసట, తలనొప్పి వంటి సమస్యల నుంచి ఈ డ్రింక్ తక్షణ ఉపశమనాన్ని చేకూరుస్తుంది.
అంతేకాదు ఈ డ్రింక్ ను ప్రస్తుత వేసవికాలంలో నిత్యం తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారు.రక్తపోటు అదుపులో ఉంటుంది.మరియు కళ్ళు మంటలు సైతం తగ్గుతాయి.







