మన శరీరానికి అవసరమయ్యే అతి ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం( Calcium ) ఒకటని అందరికీ తెలుసు.కాల్షియం మన బాడీలో ముఖ్య పాత్రను పోషిస్తుంది.
ఎముకలు మరియు దంతాల దృఢత్వానికి, శరీర అభివృద్ధికి, కండరాలు నరాల వ్యవస్థ పనితీరుకు, జ్ఞాపకశక్తిని మెరుగు పరచడానికి కాల్షియం ఎంతో అవసరం.శరీరంలో కాల్షియం లోపిస్తే ఎముకలు( Bones ) బలహీనంగా మారతాయని అంతా అనుకుంటారు.
కానీ ఎముకలు మాత్రమే కాదు కాల్షియం లోపం వల్ల మన శరీరంలో మరెన్నో ఎఫెక్ట్ అవుతాయి.అందులో గుండె కూడా ఒకటి.
శరీరంలో కాల్షియం లోపించడం వల్ల గుండె జబ్బులు( Heart Diseases ) వస్తాయని నిపుణులు చెబుతున్నారు.బాడీలో తగినంత కాల్షియం ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలను అది అదుపులో ఉంచుతుంది.
ఎప్పుడైతే కాల్షియం లోపం ఏర్పడుతుందో అప్పుడు కొలెస్ట్రాల్ స్థాయిలు( Cholestrol Levels ) కంట్రోల్ తప్పుతాయి.కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ గుండెకు ముప్పు పెరుగుతుంది.గుండెపోటుతో సహా ఇతర గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.అలాగే శరీరంలో కాల్షియం శాతం తగ్గడం వల్ల గుండె యొక్క గోడలు బలహీనపడతాయి.
దీని కారణంగా కూడా గుండె పోటుకు( Heart Attack ) గురయ్యే అవకాశాలు ఉంటాయి.

శరీరంలో తగినంత కాల్షియం లేకపోవడం వల్ల బోలు ఎముకల వ్యాధి తలెత్తుతుంది.ఎముకలు పెలుసుగా మారి తరచూ విరుగుతుంటాయి.అలాగే కాల్షియం లోపం పెద్దప్రేగు కణితులకు దారితీస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.
అంటే కాల్షియం లోపం వల్ల పెద్దపేగు కాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది.అంతేకాదు శరీరంలో కాల్షియం లోపించడం వల్ల అధిక రక్తపోటు సమస్యకు కూడా గురవుతారు.

కాబట్టి, శరీరానికి అవసరమయ్యే కాల్షియంను అందించడం మీ బాధ్యత.అందుకోసం మీరు పాలు, పాలు ఉత్పత్తులు, గుడ్డు, ఆకుకూరలు, అంజీర్, బీన్స్, తృణధాన్యాలు, గసగసాలు, నువ్వులు, బాదం పప్పు, పెరుగు, చేపలు, ఖర్జూరాలు, చియా సీడ్స్ మొదలగు కాల్షియం రిచ్ ఫుడ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.కాల్షియం లోపాన్ని తరిమికొట్టండి.